T20 World Cup 2026 : మేం చేసిన పెద్ద తప్పు అదే.. అందుకనే ఓడిపోయాం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక కామెంట్స్..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) ఇంగ్లాండ్ జట్టు పోరాటం ముగిసింది.
- Thota Vamshi Kumar
- Published On : March 6, 2026 / 07:21 AM IST
T20 World Cup 2026 Harry Brook comments after england lost match to india in semis
- సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమి
- టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఇంగ్లాండ్ ఔట్
- ఓటమి పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ హాట్ కామెంట్స్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు పోరాటం ముగిసింది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పొట్టి ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ నిష్ర్కమించింది. కాగా.. ఓటమి పై ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. ఓడిపోయినందుకు ఎంతో బాధగా ఉందన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (89; 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, శివమ్ దూబె (43; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (27; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (21; 7 బంతుల్లో 3 సిక్సర్లు) దంచికొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ పడగొట్టాడు.
Arjun Tendulkar Wedding : ఘనంగా అర్జున్ టెండూల్కర్ పెళ్లి..
అనంతరం 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాకబ్ బెథెల్ (105; 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీ చేశాడు. విల్ జాక్స్ (35; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఓడిపోయినా గర్వంగా ఉంది..
ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోయినా తమ జట్టు ఆడిన తీరు పట్ల గర్వంగా ఉందన్నాడు. చెత్త ఫీల్డింగ్‌తో పాటు పేలవ బౌలింగ్ తమ విజయావకాశాలను దెబ్బతీశాయని చెప్పుకొచ్చాడు. భారీ లక్ష్య ఛేదనలో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిందన్నాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం గురించి మాట్లాడుతూ.. పిచ్ తాజాగా ఉంది. దీంతో బంతి ఆగుతూ వస్తుందని, స్పిన్నర్లకు చక్కని సహకారం ఉంటుందని భావించామన్నాడు. అందుకనే టాస్ గెలవగానే ఫీల్డింగ్ తీసుకున్నామని చెప్పాడు. అ’యితే.. మా అంచనాలు తప్పాయి. బంతి చక్కగా బ్యాట్ పైకి వచ్చింది. ఇక నేను కూడా ఓ మిస్టేక్ చేశాను. సంజూ శాంసన్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను వదిలివేశాను. క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి అనే సామెత ఉంది. దురదృష్ట వశాత్తు ఈ రాత్రి మాకు కలిసి రాలేదు.’ అని బ్రూక్ అన్నాడు.
ఇక బౌలింగ్‌లో తాము రాణించలేకపోయామన్నాడు. భారత జట్టులో కొందరు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు ఉన్నారు. వారికి తప్పుగా బంతి వేస్తే అది బౌండరీ ఆవల పడుతుంది. ఏం చేస్తాం. కొన్ని సార్లు అలాగే ఉంటాయి. ఇక జాకబ్ బెథెల్ విషయానికి వస్తే.. అతడు చాలా బాగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ నమ్మశక్యం కానిది. అతడికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. తాను ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రపంచానికి చూపాడు. బాగానే సంపాదిస్తాడు. 250 పరుగుల లక్ష్యం కోసం మేం ఆఖరి వరకు పోరాడాము. కొన్ని జట్లు అయితే మధ్యలోనే కుప్పకూలిపోతాయి. ఈ రాత్రి మాకు కలిసి రాలేదు. నిజంగా ఈ టోర్నమెంట్‌లో ఆడిన విధానం పట్ల చాలా గర్వంగా ఉన్నాము. అని హ్యారీ బ్రూక్ అన్నాడు.
