×
Ad

T20 World Cup 2026 : భార‌త్, ఇంగ్లాండ్‌ల‌లో పై చేయి ఎవ‌రిది? హెడ్‌-టు-హెడ్ రికార్డ్స్‌, వాంఖ‌డే పిచ్ రిపోర్టు..

టీ20 ప్రపంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా గురువారం భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

T20 World Cup 2026 IND vs ENG match Pitch report head to head

  • గురువారం భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్‌
  • టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 29 సార్లు ఇరు జ‌ట్లు ముఖాముఖి
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చరిత్ర‌లో 5 సార్లు ఢీ

T20 World Cup 2026 : టీ20 ప్రపంచ‌క‌ప్ 2026లో భాగంగా గురువారం భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాలమానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఆరాట‌ప‌డుతున్నాయి. కాగా.. సూప‌ర్‌-8 గ్రూప్‌-2లో అగ్ర‌స్థానంతో ఇంగ్లాండ్ సెమీస్‌లో అడుగుపెట్ట‌గా, గ్రూప్‌-1లో రెండో స్థానంతో భార‌త్ సెమీస్‌కు చేరింది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌డం ఇది వ‌రుస‌గా మూడో సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో టీ20ల్లో ఇరు జ‌ట్లు ఎన్ని సార్లు త‌ల‌ప‌డ్డాయి ? పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం ఎన్ని సార్లు ఢీ కొన్నాయి ? మెరుగైన రికార్డు ఎవ‌రికి ఉంది ? వంటి విష‌యాల‌ను ఓ సారి చూద్దాం.

IND vs ENG : వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దైతే.. భార‌త్, ఇంగ్లాండ్‌ల‌లో ఫైన‌ల్ చేరుకునేది ఎవ‌రు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు టీ20ల్లో 29 సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త జ‌ట్టు 17 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇంగ్లాండ్ జ‌ట్టు 12 టీ20ల్లో విజ‌యం సాధించింది. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు ఐదు మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో టీమ్ఇండియా 3 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

పిచ్ రిపోర్టు..

సాధార‌ణంగా వాంఖ‌డే పిచ్ బ్యాట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం. బంతి బ్యాట్‌పైకి వ‌స్తూ ఉంటుంది. అలాగే ఆరంభంలో పేస‌ర్ల‌కు కాస్త స‌హ‌కారం ల‌భించ‌వ‌చ్చు. స్వింగ్‌, సీమ్ తో బ్యాట‌ర్లు ప‌రీక్ష ఎదుర్కొనవ‌చ్చు. మ్యాచ్ సాగే కొద్ది బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగొచ్చు. భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉన్నాయి. టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకోవ‌చ్చు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భారత జట్టు ఇదే..

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జ‌స్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

T20 World Cup 2026 : ఎంత ప‌ని చేశావుర‌య్యా.. డికాక్ చేసిన ఒక్క మిస్టేక్‌.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి సౌతాఫ్రికా ఔట్‌.. !

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు ఇదే..

ఫిలిప్ సాల్ట్ , జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్‌), సామ్ క‌ర‌న్‌, విల్ జాక్స్ , జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, జోష్ టంగ్, రెహాన్ అహ్మద్ , జామీ ఓవర్టన్, బెన్ డకెట్.