IND vs PAK : పాక్ పై గెలిచిన తరువాత.. కుల్దీప్ యాదవ్ పై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గరం గరం..
ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో (IND vs PAK) విజయం సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- February 16, 2026 / 09:47 AM IST
T20 World Cup 2026 IND vs PAK Angry Hardik Pandya and Suryakumar Yadav Scold Kuldeep Yadav
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77 పరుగులు) మెరుపు అర్థశతకం బాదాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) శివమ్ దూబె (27) లు రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
T20 World Cup 2026 : భారత్ చేతిలో ఘోర ఓటమి.. ఇలా జరిగితే టీ20 ప్రపంచకప్ నుంచి కూడా పాక్ ఔట్..
అనంతరం హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లు తలా రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ సాధించడంతో 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44) టాప్ స్కోరర్.
కుల్దీప్ యాదవ్ పై గరం గరం..
మ్యాచ్‌లో పాక్ పై విజయం సాధించిన తరువాత భారత ఆటగాళ్లు ఒకరికొకరు అభినందలు తెలియజేసుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. ఆ సమయంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లు ఇద్దరూ కూడా కోపంగా కనిపించారు.
తొలుత.. కుల్దీప్ యాదవ్‌తో హార్దిక్ కోపంగా మాట్లాడుతుండడం చూసి తిలక్ వర్మ సైతం ఆందోళనగా కనిపించాడు. అయితే.. రింకూసింగ్ మధ్యలో జోక్యం చేసుకుని సముదాయించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత సూర్య సైతం కుల్దీప్ ను ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదే కారణంమా?
కుల్దీప్ యాదవ్ పై సూర్య, హార్దిక్‌లు గరం గరం కావడానికి కారణం పాక్ ఇన్నింగ్స్ ఆఖరిలో అతడు పాహీన్ అఫ్రిది క్యాచ్‌ను వదిలివేయడమే.
పాక్ ఇన్నింగ్స్ 18 ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. తొలి బంతిని డౌన్ ది లెగ్‌గా వేశాడు. షాహీన్ అఫ్రిది ముందు వచ్చి ఆడాడు. బంతి కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది. అయితే.. సులభమైన ఈ క్యాచ్‌ను అతడు వదిలివేశాడు. ఆ తరువాత బంతికే షాహీన్ భారీ షాట్ ఆడాడు.
లాంగ్ ఆన్ బౌండరీ లైన్ వద్ద ఉన్న కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. బంతి కుల్దీప్ యాదవ్ చేతుల్లో పడి బౌండరీ లైన్ ఆవల పడింది. దీంతో వరుసగా రెండు బంతుల్లో రెండు లైఫ్‌లు షాహీన్ అఫ్రిదికి వచ్చాయి. అయినప్పటికి భారత్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఓవర్‌లోని చివరి బంతికి ఉస్మాన్ తారిక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు హార్దిక్.
అయితే.. ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో క్యాచ్ లు చేజారిచే జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకనే హార్దిక్, సూర్యలు.. కుల్దీప్ యాదవ్ పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అర్థమవుతోంది.
