IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? రద్దు అయితే పరిస్థితి ఏంటి?
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 22న) భారత్, దక్షిణాప్రికా జట్లు తలపడనున్నాయి
T20 World Cup 2026 Is there Rain threat to IND vs SA Match
IND vs SA : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 22న) భారత్, దక్షిణాప్రికా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. సూపర్-8లో భాగంగా శనివారం పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
కొలంబోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో టాస్ వేసిన తరువాత భారీ వర్షం కురిసింది. ఎంతకు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే పాక్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు. ఈ క్రమంలో ఈ రెండు జట్లు సూపర్-8లో ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌లు ఎంతో కీలకంగా మారాయి.
Shikhar Dhawan : మళ్ళీ పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. ఫోటోలు వైరల్
ఈ క్రమంలో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఏమైన వర్షం ముప్పు పొంచి ఉందా?, ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదు. వాతావరణం పొడిగా ఉంటుందని అక్యూవెదర్ తెలిపింది.భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైతే అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చొరక పాయింట్ ను కేటాయిస్తారు.
హెడ్-టు-హెడ్..
టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా, భారత్‌లు ఇప్పటి వరకు టీ20ల్లో 35 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి.
ఇందులో 21 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
