Kuldeep Yadav : దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. చాహల్ టీ20 రికార్డు పై కుల్దీప్ కన్ను.. చరిత్ర సృష్టించేనా?
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ( Kuldeep Yadav) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : February 22, 2026 / 11:51 AM IST
T20 World Cup 2026 Kuldeep Yadav Eye On Massive Record of chahal
Kuldeep Yadav : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఓ మైలురాయి ఊరిస్తోంది.
2017లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు కుల్దీప్ యాదవ్. ఇప్పటి వరకు అతడు 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉంది.
ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు గనుకు ఐదు వికెట్లు తీస్తే.. భారత్ తరుపున 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరుతాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు మాత్రమే ఇప్పటి వరకు భారత్ తరుపున 100 టీ20 వికెట్లు తీశారు.
రెండు వికెట్లు తీస్తే..
కనీసం రెండు వికెట్లు పడగొట్టినా కూడా కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు. భారత్ తరుపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో అతడు యుజ్వేంద్ర చాహల్ ను అధిగమిస్తాడు. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు.
భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లు వీరే..
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు
* కుల్దీప్ యాదవ్ – 54 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు
* అక్షర్ పటేల్ – 90 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు
* వరుణ్ చక్రవర్తి – 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు
* రవి బిష్ణోయ్ – 44 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు
