T20 World Cup 2026 : ముద్దులే.. ముద్దులు.. మైదానంలోనే హార్దిక్, మహికా శర్మ.. టీ20 ప్రపంచకప్ విజయం తరువాత
భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తరువాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికాశర్మతో కలిసి చేసుకున్న సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి
- Thota Vamshi Kumar
- Updated on- March 9, 2026 / 11:56 AM IST
T20 World Cup 2026 Mahieka Sharma kisses Hardik Pandya in the ground
- టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్
- మైదానంలో హార్దిక్, మహికా సంబరాలు
T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలు అయ్యాయి. పొట్టి ప్రపంచకప్ గెలవగానే ఆటగాళ్లు మైదానంలో చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి శైలిలో వారు సంబరాలు చేసుకున్నారు. కాగా.. ఆటగాళ్లు అందరిలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత జట్టు ప్రపంచకప్‌ను గెలవగానే.. మహికా శర్మ మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి హార్దిక్ పాండ్యాను ముద్దు పెట్టుకుంది. అనంతరం హార్దిక్ ఆమెను కౌగలించుకున్నాడు. ఆ తరువాత హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌తో హార్దిక్ మాట్లాడాడు. మహికా పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తన జీవితంలోకి వచ్చిన తరువాత నుంచి అన్ని విజయాలే వస్తున్నాయన్నాడు. ఆమె ఎంతో మద్దతు ఇస్తుందన్నాడు.
మరిన్ని ట్రోఫీలు గెలవడమే లక్ష్యం..
తాను ఇంకో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు హార్దిక్ చెప్పుకొచ్చాడు. మరో ఐదు లేదా ఆరు ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 తరువాత తాను గట్టిగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపాడు. తాను ఆడే ప్రతి టోర్నీలోనూ ట్రోపీ గెలవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దాన్ని నిజం చేసుకునేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపాడు.
ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 9 మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.
