×
Ad

T20 World Cup 2026 : గ్లెన్ ఫిలిప్స్ ఊచ‌కోత‌.. సూప‌ర్‌-8కి న్యూజిలాండ్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూప్‌-డి నుంచి 3 టీమ్‌లు ఔట్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026 ) న్యూజిలాండ్ జ‌ట్టు సూప‌ర్ -8కి అర్హ‌త సాధించింది.

T20 World Cup 2026 New Zealand win by 8 wickets against Canada and enter into Super 8

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో న్యూజిలాండ్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో కెన‌డా పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో సూప‌ర్ 8కి అర్హత సాధించింది.

174 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కివీస్ 15.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ (76 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. ర‌చిన్ ర‌వింద్ర (59; 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఫిన్ అలెన్ (21; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. కెన‌డా బౌల‌ర్ల‌లో దిలోన్ హేలిగర్, సాద్ బిన్ జాఫర్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

T20 World Cup 2026 : చ‌రిత్ర సృష్టించిన యువ‌రాజ్ సమ్రా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏకైక బ్యాట‌ర్‌..

అంత‌క ముందు తొలుత బ్యాటింగ్ చేసిన కెన‌డా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. కెన‌డా బ్యాట‌ర్ల‌లో యువరాజ్ సమ్రా (110; 65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. దిల్‌ప్రీత్ బజ్వా (36; 39 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, కైల్ జేమీస‌న్‌, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్ లు త‌లా వికెట్ తీశారు.

T20 World Cup 2026 : శ్రీలంక చేతిలో అందుకే ఓడిపోయాం.. ఇక ఐర్లాండే మాకు దిక్కు.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కామెంట్స్‌..

గ్రూప్ డి నుంచి ద‌క్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ జ‌ట్లు సూప‌ర్ 8కి అర్హ‌త సాధించాయి. దీంతో ఈ గ్రూప్‌లో మిగిలిన అఫ్గానిస్థాన్‌, యూఏఈ, కెన‌డాలు టీ20 ప్ర‌పంచ‌కప్ నుంచి నిష్ర్క‌మించాయి.