T20 World Cup 2026 SA vs UAE South Africa opt to bowl
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం యూఏఈ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు సూపర్-8కు అర్హత సాధించగా యూఏఈ జట్టు రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రమే. అయితే.. యూఏఈ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వర్షం సూచనలు ఉన్నాయి. వికెట్ పేసర్లకు సహకరించవచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. తుది జట్టులో నాలుగు మార్పులు ఉన్నాయి.’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ తెలిపాడు.
Kuldeep Yadav : నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
‘మేము టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే వాళ్లం. అయినప్పటికి కూడా తొలుత బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మేఘాల నుంచి సూర్యుడు బయటకు వస్తే పిచ్ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశం ఉంది. మెరుగైన స్కోరును సాధించేందుకు ప్రయత్నిస్తాం. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఆరోన్ మాలిక్‌ను వచ్చాడు. అతడు బ్యాట్, బాల్‌తో రెండింటితో జట్టుకు సమతూకాన్ని తీసుకువస్తాడు.’ అని యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అన్నాడు.
దక్షిణాఫ్రికా తుది జట్టు..
ఐడెన్ మార్ క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, జాసన్ స్మిత్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, క్వేనా మఫాకా
యూఏఈ తుది జట్టు..
ఆర్యన్ష్ శర్మ(వికెట్ కీపర్), ముహమ్మద్ వసీం(కెప్టెన్), అలీషన్ షరాఫు, సోహైబ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ అర్ఫాన్, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ ఫరూక్, హైదర్ అలీ, జునైద్ సిద్దిక్, ముహమ్మద్ జవదుల్లా