T20 World Cup 2026 Team India Super 8 schedule fix Opponents Dates And Venues details here
మంగళవారం పల్లెకలె వేదికగా ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వే సూపర్ 8 దశకు అర్హత సాధించంది. ఈ నేపథ్యంలో భారత్ సూపర్-8 ప్రత్యర్థులు ఎవరు అన్నది తేలిపోయింది.
సూపర్-8 గ్రూప్ 1లో భారత్‌తో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. భారత్ మిగిలిన జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తరువాత చెన్నైలో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో ఆడనుంది. ఇక సూపర్-8లో చివరి మ్యాచ్‌ను మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది.
భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 22న – దక్షిణాఫ్రికాతో (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26న – జింబాబ్వేతో (చెన్నై)
* మార్చి 1న – వెస్టిండీస్ తో (కోల్‌కతా)
ఇదిలా ఉంటే.. నేడు (బుధవారం ఫిబ్రవరి 18న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ తమ చివరి గ్రూప్-దశ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నెదర్లాండ్స్ జట్టు ఇప్పటి వరకు భారత్‌తో ఒకే ఒక సారి తలపడింది. సిడ్నీ వేదికగా టీ20 ప్రపంచకప్2022లో ఇరు జట్లు తలపడగా.. ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.
T20 World Cup 2026 : చరిత్ర సృష్టించిన యువరాజ్ సమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో ఏకైక బ్యాటర్..
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్