×
Ad

IND vs ZIM : భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల (IND vs ZIM)మ‌ధ్య గురువారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

T20 World Cup 2026 Will rain spoil IND vs ZIM Super Eight clash

  • గురువారం చెపాక్ వేదిక‌గా భార‌త్, జింబాబ్వే మ‌ధ్య కీల‌క మ్యాచ్‌
  • భార‌త్ సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే భారీ విజ‌యం సాధించాల్సిందే
  • ఓడితే టోర్నీ నుంచి ఔట్‌

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య గురువారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్లు త‌మ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోవ‌డంతో సెమీస్ బ‌రిలో నిల‌వాలంటే అటు భార‌త్‌, ఇటు జింబాబ్వే జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ ఎంతో కీల‌కం. ఓడిపోయిన జ‌ట్టు టోర్నీ నుంచి నిష్ర్క‌మిస్తుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్ హోరాహోరీగా జ‌ర‌గ‌డం ఖాయం.

చెరో మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ద‌క్షిణాఫ్రికా (3.800), వెస్టిండీస్ (5.350)లు గ్రూప్‌-1లో నెట్‌ర‌న్‌రేటులో ఎంతో ముందు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1లో టాప్‌-2లో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు భారీ తేడాతో విజ‌యం సాధించాల్సి ఉంటుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ప‌లు మ్యాచ్‌ల‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌లు మ్యాచ్ ర‌ద్దు అయ్యాయి కూడా. ఈ క్ర‌మంలో భార‌త్‌, జింబాబ్వే మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు ఏమైనా ఉందా ? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి అనేది కూడా అభిమానుల్లో సందేహం మొద‌లైంది.

చెన్నై వాతావ‌ర‌ణ నివేదిక‌..

క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త ఇది. భార‌త్, జింబాబ్వే మ్యాచ్‌కు ఎలాంటి వ‌ర్షం ముప్పు లేదని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. మ్యాచ్ రోజు ఉద‌యం ఉష్ణోగ్ర‌త 31 డిగ్రీల సెల్పియ‌స్‌గా ఉంటుంద‌ని చెప్పింది. రాత్రి పూట వాతావ‌ర‌ణం చాలా స్ప‌ష్టంగా ఉంటుంద‌ని పేర్కొంది.

ఒక వేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే.. అప్పుడు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు భార‌త్ సెమీస్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టం అవుతాయి.

స్క్వాడ్‌లు ఇవే..

భారత జ‌ట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా , అర్ష్‌దీప్ సింగ్ , జస్‌ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్,

జింబాబ్వే..
సికందర్ రజా (కెప్టెన్‌), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, రిచార్యన్ ముజరాబ్, బ్లెస్సింగ్ ఎన్‌గార్రాబనీ