Pic: @ICC and @cricketcomau
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8లోకి వెళ్లే అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇక నామమాత్రపు మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఇవాళ ఐర్లాండ్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిస్తే ఆ జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు సూపర్-8లోకి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉండేవి.
Also Read: Varanasi: మహా శివభక్తుడిగా ప్రకాష్ రాజ్.. వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నటుడు
మ్యాచ్ రద్దు కావడంతో ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్-బీ నుంచి జింబాబ్వే సూపర్-8 బెర్తు ఖరారైంది. దీంతో ఆస్ట్రేలియా సూపర్-8 ఆశలపై వరుణుడు నీళ్లుచల్లినట్లయింది. ఇక గ్రూప్-బీ నుంచి ఇప్పటికే శ్రీలంక సూపర్-8లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా ఖేల్ ఖతం అయింది.
గ్రూప్-బీలో ఆస్ట్రేలియా సహా మిగతా జట్ల పరిస్థితి ఇదీ..
| జట్టు | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | నో రిజల్ట్ | పాయింట్లు |
|---|---|---|---|---|---|
| శ్రీలంక (క్వాలిఫైడ్) | 3 | 3 | 0 | 0 | 6 |
| జింబాబ్వే (క్వాలిఫైడ్) | 3 | 2 | 0 | 1 | 5 |
| ఐర్లాండ్ (ఎలిమినేట్) | 4 | 1 | 2 | 1 | 3 |
| ఆస్ట్రేలియా (ఎలిమినేట్) | 3 | 1 | 2 | 0 | 2 |
| ఒమాన్ (ఎలిమినేట్) | 3 | 0 | 3 | 0 | 0 |