×
Ad

T20 World Cup : మేము చేసిన పెద్ద తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ కీలక కామెంట్స్

T20 World Cup : టీమిండియా అదరగొట్టింది. సెమీస్‌లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే, ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

West Indies Captain Shai Hope

  • సూపర్-8 పోరులో వెస్టిండీస్‌పై భారత్ విజయం
  • సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
  • ఓటమిపై విండీస్ కెప్టెన్ కీలక కామెంట్స్

T20 World Cup : టీమిండియా అదరగొట్టింది. సెమీస్‌లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆదివారం సూపర్-8లో భాగంగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. అయితే, ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

Also Read : T20 World Cup: కీలక మ్యాచ్‌లో విండీస్‌పై ఘన విజయం.. సెమీస్‌కి దూసుకెళ్లిన భారత్

టీమిండియాపై మ్యాచ్ లో ఓటమి అనంతరం షై హోప్ మాట్లాడుతూ.. ఇది ఛేజింగ్‌కు అనుకూలించే మైదానం.. మేము చివరిలో ఇంకాస్త ధాటిగా ఆడి ఉండాల్సింది. మేము భారత జట్టుకు మరికొన్ని ఎక్కువ పరుగులు టార్గెట్‌గా ఇచ్చిఉంటే ఫలితం మరోలా ఉండేది. సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాంసించాడు. నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందుకు అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని షై హోప్ పేర్కొన్నాడు.

భారత ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా భారత ప్రధాన బౌలర్లలో ఒకడు. అతని చేతిలో బంతి ఉందంటే ఏదో ఒకటి జరుగుతుందని తెలుసు. ముఖ్యంగా హెట్‌మైర్ ఈ టోర్నీలో చాలాబాగా ఆడుతున్నాడు. అద్భుత బౌలింగ్‌తో బుమ్రా అతన్ని త్వరగా పెవిలియన్ కు పంపించాడు. అతని వికెట్ తీయడం ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అయినప్పటికీ మేము 190 ప్లస్ పరుగులు చేసి గెలిచే అవకాశాలను సృష్టించుకున్నాం.

మా జట్టు బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, ఈరోజు మేము గెలుపు గీతను దాటలేకపోయాం. ఎవరూ కూడా ఈ దశలో నిష్ర్కమించాలని కోరుకోరు. మొత్తానికి ఈ మ్యాచ్ లో కీలక సమయాల్లో గెలుపును మావైపుకు తిప్పుకోవటంలో మేము విఫలం అయ్యామంటూ షై హోప్ పేర్కొన్నాడు.