T20 World Cup 2021: ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ కీలక ఆటగాడు దూరం
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఆసీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు.. కివీస్ కీలక ప్లేయర్ దూరం కానున్నాడు.
- Subhan Ali Shaik
- Published On : November 13, 2021 / 09:32 PM IST
T20 Workld Cup 2021
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఆసీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు.. కివీస్ కీలక ప్లేయర్ దూరం కానున్నాడు. నవంబర్10న ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు కాన్వే. తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.
అదే సమయంలో కొంత అసహనానికి గురై.. చేతితో బ్యాట్‌ను బలంగా గుద్దడంతో కుడి చేతి ఎముక విరిగింది. అలా గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు కూడా సీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. న్యూజిలాండ్ తరపున 36 టీ20ల్లో 703 పరుగులు చేశాడు. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
………………………………………… : తిరుమలకు అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు
