TTD : తిరుమలకు అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్

TTD : తిరుమలకు అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు

Ttd Tirumala

TTD : తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ టీటీడీకి సర్టిఫికెట్ అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ ప్రతినిధులు స్వయంగా అందజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా తిరుమలలో ఉచితంగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 వేల నుంచి 70 వేల మంది భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని చెప్పారు.

Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

కల్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్న ఇబ్బంది లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన వివరించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నామని చెప్పారు.

Quit Jobs : అమెరికాలో రాజీనామాల సంక్షోభం.. ఒక్క నెలలోనే 44 లక్షల మంది ఉద్యోగులు రిజైన్

ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదంలో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని చెప్పారు. రోజూ ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్నా తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని గుర్తు చేశారు. ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.