Quit Jobs : అమెరికాలో రాజీనామాల సంక్షోభం.. ఒక్క నెలలోనే 44 లక్షల మంది ఉద్యోగులు రిజైన్

కరోనా మహమ్మారి ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది

Quit Jobs : అమెరికాలో రాజీనామాల సంక్షోభం.. ఒక్క నెలలోనే 44 లక్షల మంది ఉద్యోగులు రిజైన్

Quit Jobs

Quit Jobs : కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. విలయతాండవం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది. ఉద్యోగం, జీతం లేకుండా నెట్టుకురావడం ఎలాగో కరోనా వేళ తెలుసుకున్న ధైర్యమే వారిని ముందుకు నడిపిస్తోంది. ఉద్యోగులు కెరీర్ లో మార్పు కోరుకుంటున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఉద్యోగాలను వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలను విడిచి పెట్టగా.. సెప్టెంబర్​లో ఈ సంఖ్య 44 లక్షలుగా నమోదైంది. సెప్టెంబర్​లో 44 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతం కావడం గమనార్హం.

SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు

కొత్త అవకాశాల కోసమే పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. భారీగా ఉద్యోగాలు వదులుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతున్నప్పటికీ వారికి ఉద్యోగార్థులు లభించడం లేదు. శీతాకాల సెలవులు, క్రిస్మస్ సీజన్ ఉన్న నేపథ్యంలో అనేక సంస్థలు అదనంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకునే దారిలో ఉందనే నమ్మకం కలుగుతున్న తరుణంలో అమెరికా, యూరప్ దేశాల్లో ఉద్యోగులు పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. పని పట్ల వ్యతిరేక ధోరణితో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు.

Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

ఒక్క అమెరికాలోనే కాదు చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలకు రిజైన్ చేసే ఈ ట్రెండ్‌ను ‘ద గ్రేట్‌ రిజిగ్నేషన్‌’గా వ్యవహరిస్తున్నారు. 50 శాతం మంది అమెరికన్లు తమ కెరీర్‌లో మార్పు కోరుకుంటున్నారు.

చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టాలన్న నిర్ణయానికి రావడానికి రెండు ప్రధాన కారణాలున్నట్టు సర్వేలో తేలింది.
* ఒకటి.. యాజమాన్యాలు తమను అర్థం చేసుకోవట్లేదని, తమ పట్ల సానుభూతితో వ్యవహరించట్లేదని ఉద్యోగులు భావిస్తున్నారు.
* రెండోది.. సౌలభ్యం. అంటే.. తాము పనిచేస్తున్న ప్రదేశం, చేస్తున్న పని వంటివి తమకు సౌకర్యవంతంగా లేకపోతే ఉద్యోగాన్ని ధైర్యంగా వదిలేస్తున్నారు.
కరోనా సమయంలో తమకు కల్పించిన సౌలభ్యాలను (ఇంటి నుంచే పని చేసే వీలు వంటివి) శాశ్వతంగా కల్పించాలని 76% మంది కోరారట. 39% మంది జీతం పెంపు/ప్రమోషన్‌ కోసం రాజీనామాలు చేస్తుంటే.. 33% మంది మార్పు కోసం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.