SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు

 ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. డిసెంబరు 1 నుంచి క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై అదనంగా రూ.99లు ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనుంది.

SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై అదనంగా రూ.99 ఫీజు

Sbi Credit Card

SBI Credit Card ALERT: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. డిసెంబరు 1 నుంచి క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై అదనంగా రూ.99లు ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) విడుదల చేసిన స్టేట్‌మెంట్ వివరాలిలా ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు ఇటీవల విడుదల చేసిన ఈ-మెయిల్‌ ప్రకారం..

‘డిసెంబరు 1, 2021 నుంచి మర్చెంట్ ఈఎంఐ లావాదేవీలపై పన్నులతో పాటు రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనున్నాం. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, మర్చంట్‌ అవుట్‌లెట్లు, యాప్‌లలో జరిపే లావాదేవీలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ఈ ఫీజు వర్తిస్తుంది’ అని ఎస్‌బీఐ పేర్కొంది.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోదలిస్తే.. ఈ ఫీజు భరించాల్సిందే. కస్టమర్లకు మరింత భారం పడుతుండటంతో ఈఎంఐ ఆప్షన్‌ తో కొనుగోలు చేయాలనుకునేవారు కాస్త ఆలోచించుకుని వెళ్లడం మంచింది.

……………………………………. : కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను తరిమికొడతారు : రోజా

దీని ప్రకారం.. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ ఫోన్‌ కొని దానికి ఈఎంఐ ఆప్షన్‌ పెట్టుకున్నారనుకోండి.. ఆ చెల్లింపులను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్‌ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీ క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కన్పిస్తుంది. ఈఎంఐ లావాదేవీ రద్దయితే ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ప్రాసెసింగ్‌ ఫీజుకు.. ఇంట్రస్ట్‌ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. జీరో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం సమయంలోనూ ఈ ప్రాసెసింగ్‌ ఫీజు అదనంగా వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది.