Vaibhav Sooryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ భ‌విష్య‌త్ పై భార‌త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్.. ఓపిక, స‌హ‌నం, సాయం అంటూ కీల‌క వ్యాఖ్య‌లు..

టీమ్ఇండియాలో చోటు సంపాదించిన వైభ‌వ్ సూర్య‌వంశీపై భార‌త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ (Vaibhav Sooryavanshi) ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

Team India batting coach Sitanshu Kotak key comments on Vaibhav Sooryavanshi

  • అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించ‌డం అంత ఈజీ కాదు
  • సుదీర్ఘ కెరీర్ ఉండాలంటే ఓపిక, స‌హ‌నం ఉండాలి
  • వైభ‌వ్ సూర్య‌వంశీకి నాకు చేత‌నైన సాయం చేస్తా
  • భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్‌

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుని టీమ్ఇండియాలో చోటు సంపాదించిన వైభ‌వ్ సూర్య‌వంశీపై భార‌త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డు అంత‌ర్జాతీయ స్థాయిలో ఎలా ఆడాతాడో చూసేందుకు తాను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

15 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ ల‌లో ప‌ర్య‌టించే భార‌త టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. ఐపీఎల్ 2026లో హేమాహేమీ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్న అత‌డు అంత‌ర్జాతీయ స్థాయిలో ఎలా ఆడ‌తాను అన్న దానిపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

IND-w vs ENG-w : మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. భార‌త్ వ‌ర్సెస్‌ ఇంగ్లాండ్ వార్మ‌ప్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడొచ్చంటే?

అఫ్గాన్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో విజ‌యం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ ప్ర‌ద‌ర్శ‌న‌, అత‌డి భ‌విష్య‌త్ పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వైభ‌వ్ అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘకాలం రాణించాలంటే ఓపిక, నమ్మకం అనేవి అత్యంత కీలకమైన అంశాలని తెలిపాడు.

అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ప్ర‌తి ఆట‌గాడికి త‌మ‌దైన ఆలోచ‌న విధానం, ఆట‌తీరు ఉంటాయ‌న్నాడు. వారికి కోచ్‌లు కొత్త విష‌యాల‌ను నేర్పించాలంటే స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు. కోచ్‌పై ఆట‌గాడికి నమ్మ‌కం క‌ల‌గాల‌ని అన్నాడు. ఇక వైభ‌వ్ విష‌యంలో అత‌డికి తాను ఎంత వ‌ర‌కు సాయం చేయ‌గ‌ల‌నో గ‌మ‌నించి, అత‌డి స‌హ‌జ సిద్ధ‌మైన ఆట‌తీరుకు భంగం క‌ల‌గ‌కుండా అవ‌స‌రం అయిన మేర‌కే స‌ల‌హాలు ఇస్తాన‌ని అన్నాడు.

BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం.. 36 ఏళ్ల చ‌రిత్ర‌లో ఇది రెండోసారి..

గతంలో వైభవ్‌ను అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో చూశానని, అయితే ఇటీవల ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు నమ్మశక్యం కాని విధంగా ఉందని సితాన్షు కొట‌క్ తెలిపాడు. 15 ఏళ్ల వ‌య‌సులోనే అంత‌టి ఒత్తిడిని ఎదుర్కొంటూ విజ‌యవంతంగా రాణించ‌డం అత‌డి అసాధార‌ణ ప్ర‌తిభ‌ను నిద‌ర్శ‌నం అని కొనియాడాడు.