Shreyas Iyer : ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్.. ఉప్పెనలా దూసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్.. 9ఏళ్ల కెరీర్‌లో తొలిసారి
Shreyas Iyer : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు.
- Harish Thanniru
- Published on- October 7, 2026 / 09:18 PM IST
Shreyas Iyer
Shreyas Iyer : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్‍తో సెంచరీ పూర్తి చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. అతడు.. ఏకంగా 18 స్థానాలు జంప్ కొట్టి ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇది శ్రేయస్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్.
మరోవైపు.. భారత జట్టు బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ టాప్-2 స్థానాలను నిలబెట్టుకున్నారు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ పదో స్థానంలో ఉన్నాడు. దీంతో టాప్ 10లో నలుగురు భారత బ్యాటర్లు ఉండటం విశేషం.
టీ20 ఫార్మాట్‌లో టాప్-5 బ్యాటర్లు వీరే : ఇషాన్ కిషన్ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), షాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), జూస్ బట్లర్ (ఇంగ్లాండ్).
మరోవైపు వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత స్థానంలో రోహిత్ శర్మ ఉండగా.. కేఎల్ రాహుల్ ఏడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
వన్డే ర్యాకింగ్స్ టాప్ -5 బ్యాటర్లు : శుభ్‌మన్ గిల్ (భారత్), డారిల్ మిచెల్ ( న్యూజిలాండ్), విరాట్ కోహ్లీ (భారత్), రోహిత్ శర్మ (భారత్), ఇబ్రహీమ్ జర్దాన్ (అప్గానిస్థాన్).
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత బౌలర్ల విషయానికొస్తే.. టాప్-5 ర్యాంకింగ్ లో ఎవరూ లేరు. అయితే, అక్షర్ పటేల్ ర్యాంకింగ్స్ లో పురోగతి సాధించాడు. గతవారం మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్లు తీసిన అక్షర్ 16స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్ కు చేరుకున్నాడు.
