Team India: సెంచూరియా వేదికగా టీమిండియా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
టీమిండియా ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ న్యూ ఇయర్ వేడుకలను సెంచూరియాలోని ఓ హోటల్లో జరుపుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ వేడుకలకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో....
- Subhan Ali Shaik
- Published On : January 1, 2022 / 12:24 PM IST
Virat Kohli (2)
Team India: టీమిండియా ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ న్యూ ఇయర్ వేడుకలను సెంచూరియాలోని ఓ హోటల్లో జరుపుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ వేడుకలకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయి సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.
ఈ ఫొటోతో పాటు న్యూ ఇయర్ న్యూ హోప్స్! విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ 2022 అంటూ కామెంట్ చేశారు.
స్కిప్పర్ విరాట్ కోహ్లీ మొహమ్మద్ షమీ పక్కన కూర్చొని ఉండగా అజింకా రహానె, చతేశ్వర్ పూజారాలు ఒకే చోట ఉన్నారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ చివరి వరుసలో నిల్చొని ఫొటోకు ఫొజిచ్చారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కరాత్రే 3146కేసులు నమోదు
టీమిండియా కొత్త సంవత్సరంలో సౌతాఫ్రికాపై మూడు టెస్టుల మ్యాచ్ లో భాగంగా రెండో టెస్టును జనవరి 3న ఆడనుంది. ఇప్పటికే తొలి టెస్టును 113పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా.
New year new hopes! Wish you all a happy and prosperous 2022. #HappyNewYear pic.twitter.com/cssKEpeePI
— Ashwin ?? (@ashwinravi99) December 31, 2021
