Wayne Madsen Representative Image (Image Credit To Original Source)
Wayne Madsen: ఒక వ్యక్తి ఒక క్రీడలో రాణించడమే గొప్ప. ఇక ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. అయితే, ఒకే వ్యక్తి రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించడం అంటే మామూలు విషయం కాదు. అదీ వేర్వేరు క్రీడల్లో రాణించడం అంటే అసాధారణ టాలెంట్ అనే చెప్పాలి. ఓ క్రీడాకారుడు ఈ అరుదైన ఘనత సాధించాడు. రెండూ వేర్వేరు క్రీడల్లో రెండు దేశాల తరపున అదీ వరల్డ్ కప్ లో పాల్గొనడం రియల్లీ గ్రేట్ కదూ.
స్పోర్ట్స్ హిస్టరీలో ఇదొక అరుదైన ఘట్టంగా చెప్పుకోవాల్సిందే. సాధారణంగా ఒక ఆటగాడు రెండు దేశాల తరపున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. ఇప్పుడు అంతకుమించిన ఘట్టం ఆవిష్కృతమైంది. రెండు దేశాల తరపున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్‌లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటు చేసుకోనుంది. ఈ హిస్టరీ క్రియేట్ చేసిన ఆటగాడి పేరు వేన్ మాడ్‌సన్. అతడు గతంలో ఓ దేశం తరపున హాకీ వరల్డ్ కప్ ఆడాడు. ఇప్పుడు మరో దేశానికి క్రికెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో క్రీడా వర్గాల్లో వేన్ మ్యాడ్ సన్ పేరు మార్మోగిపోతోంది. ఎవరు బ్రో నువ్వు ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావ్.. హాకీ వరల్డ్ కప్ ఒక దేశానికి ఆడి.. ఇప్పుడు ఇంకో దేశానికి క్రికెట్ ఆడుతున్నావా.. అని అంతా నోరెళ్లబెడుతున్నారు. అతడి టాలెంట్ కి ఫిదా అవుతున్నారు.
వేన్ మాడ్ సన్ 2006లో సౌతాఫ్రికా తరపున హాకీ వరల్డ్ కప్ ఆడాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇటలీ టీ20 వరల్డ్ కప్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. మ్యాడ్ సన్ గతంలో పీఎస్ఎల్, బీపీఎల్, హండ్రెడ్ లీగ్‌లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరపున 2023లో ఎంట్రీ ఇచ్చాడు.
దక్షిణాఫ్రికాలో జన్మించిన వేన్ మాడ్సెన్ టీ20 ప్రపంచ కప్‌లో ఇటలీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో ఇటలీ ఆడుతోంది. నేపాల్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్-సిలో స్థానం సంపాదించింది. ఫిబ్రవరి 9న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ ఈవెంట్‌లో తమ తొలి ప్రదర్శనలో ప్రభావం చూపాలని పట్టుదలగా ఉంది. ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ రెండు వేర్వేరు క్రీడల్లో ప్రపంచ కప్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి అథ్లెట్‌గా అవతరించి వార్తల్లో నిలిచాడు.
మాడ్ సన్ 2006లో హాకీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. 20 సంవత్సరాల తర్వాత, 2026 T20 ప్రపంచ కప్‌లో ఇటలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికా హాకీ ప్రపంచ కప్ జట్టులో ఎంపికైనప్పుడు మాడ్సెన్ వయసు కేవలం 22 సంవత్సరాలు. ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి, మూడు ఓడి, రెండు డ్రా చేసుకుంది. భారత్, దక్షిణ కొరియాతో 1-1.. 2-2తో డ్రా చేసుకున్నారు. 11వ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌లో దక్షిణాఫ్రికా కూడా భారత్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓడిపోయి చివరి స్థానంతో వరల్డ్ కప్ ను ముగించింది.
22 సంవత్సరాల వయస్సులో మాడ్సెన్ 2006లో హాకీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. కాగా, 2004లోనే దక్షిణాఫ్రికా దేశీయ సర్క్యూట్‌లో క్వాజులు-నాటల్ తరపున ఫస్ట్-క్లాస్ లిస్ట్ A ద్వారా అరంగేట్రం చేశాడు. హాకీ ప్రపంచ కప్ తర్వాత మాడ్సెన్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంగ్లాండ్ దేశీయ క్రికెట్‌లో డెర్బీషైర్ తరపున ఆడాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన దత్తత దేశమైన ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి కూడా అర్హత పొందాడు. దురదృష్టవశాత్తు, అతను దక్షిణాఫ్రికా లేదా ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు.
జూలై 2023లో, వేన్ మాడ్సెన్ జెర్సీతో జరిగిన మ్యాచ్‌తో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి ఈ ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 42 సంవత్సరాల వయసులో, అతను T20 ప్రపంచ కప్‌లో ఇటలీకి నాయకత్వం వహించబోతున్నాడు. ఇప్పటివరకు మాడ్సెన్ 132.25 స్ట్రైక్ రేట్‌తో 205 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. T20 క్రికెట్‌లో 219 మ్యాచుల్లో 135.16 స్ట్రైక్ రేట్‌తో 5వేల 516 పరుగులు చేశాడు. అతని జట్టుకు 2 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇటలీ తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో రాణించింది. తమకంటే మెరుగైన ప్లేస్ లో ఉన్న కెనడాను ఓడించింది. ఇక టోర్నమెంట్ మొత్తం గెలుపు జోరును కంటిన్యూ చేయాలని తహతహలాడుతోంది.
Also Read: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. గంభీర్ నుంచి కోహ్లీ వరకు