Deepak Chahar: టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దుర్భాషలాడుతూ, చంపేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే, బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులుగా తెలుస్తోంది. ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Chahar Brothers : సాహోరే చహర్ బ్రదర్స్.. ఐపీఎల్లో అన్నదమ్ముల హవా..మ్యాచ్ విన్నర్లుగా గుర్తింపు
దీపక్ చాహర్ భార్య భరద్వాజ్ బిజినెస్ వెంచర్ పేరుతో మోసపోయింది. హైదరాబాద్‌కు చెందిన ధృవ్, కమలేష్ ప్రతీక్‌లు అనే వ్యక్తులు రూ. 10లక్షల తీసుకొని భరద్వాజ్‌ను మోసం చేసినట్లు చాహర్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతేడాది అక్టోబర్ 7న ఇద్దరు వ్యక్తులు జయ భరద్వాజ్ వద్ద పది లక్షలు తీసుకున్నారని, ఆ తరువాత డబ్బులు అడిగితే ఇవ్వకపోగా, అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం జయ భరద్వాజ్ ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని చాహర్ భార్య, ఆయన తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
2021 ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో దీపక్ చాహర్, జయ భరద్వాజ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. గతేడాది జూన్ 2న వీరి వివాహం జరిగింది. 30ఏళ్ల చాహర్ టీమిండియా తరపున 24 టీ20 మ్యాచ్‌లుఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చాహర్ 10 వికెట్లు పడగొట్టాడు.