×
Ad

Tilak Varma : రీఎంట్రీలో తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ బ్యాటింగ్‌.. 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లతో

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ (Tilak Varma) రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు.

Tilak Varma Shines in India A Clash Against USA T20 World Cup warm up match

Tilak Varma : టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు. శ‌స్త్ర‌చికిత్స కార‌ణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న ఈ ఆట‌గాడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 వార్మ‌ప్ మ్యాచ్‌లో భార‌త్‌-ఏ త‌రుపున బ‌రిలోకి దిగి స‌త్తా చాటాడు.

సోమ‌వారం యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన తిల‌క్ వేగంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న తిల‌క్ 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 38 ప‌రుగులు సాధించాడు. అంతేకాదండోయ్ ఈ మ్యాచ్‌లో అత‌డు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాటింగ్‌, ఫీల్డింగ్ చేశాడు. ఇది భార‌త జ‌ట్టుకు శుభ‌వార్తే.

Salman Ali Agha : భార‌త్‌తో ఆడొద్ద‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కామెంట్స్..

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. 38 ప‌రుగుల తేడాతో భార‌త్-ఏ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌-ఏ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 238 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో జ‌గ‌దీశ‌న్ (104; 55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా కెప్టెన్ ఆయుష్ బ‌దోని (60 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు.

అనంత‌రం 239 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన యూఎస్ఏ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగుల‌కు ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాట‌ర్ల‌లో అండ్రీస్ గాస్ (44), సంజ‌య్ కృష్ణ‌మూర్తి (41) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ మూడు వికెట్లు తీశాడు. న‌మ‌న్ ధీర్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.