Vaibhav Sooryavanshi : అఫ్గాన్‌పై దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. ఉన్నంత సేపు ఊపాడు గానీ..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) అదరగొట్టాడు
- Thota Vamshi Kumar
- Updated on- June 11, 2026 / 11:54 AM IST
Tri Nation A Series Vaibhav Sooryavanshi 44 runs out against Afghanistan A
- దంబుల్లా వేదిగా జరుగుతున్న భారత్-ఏ వర్సెస్ అఫ్గాన్-ఏ మ్యాచ్
- అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. శ్రీలంక-ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి విఫలమైన బుడ్డోడు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. అఫ్గాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.
ఇన్నింగ్స్ రెండో బంతి, తాను ఆడిన తొలి బంతికే బౌండరీ బాది తన ఉద్దేశ్యాన్ని చెప్పిన వైభవ్.. అఫ్గాన్ బౌలర్లు అందరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మొత్తంగా 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి అబ్దుల్లా అహ్మద్జాయ్ బౌలింగ్‌లో ఇషాక్ రహీమి క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 7.1 ఓవర్లలో 74 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
ఐపీఎల్ 2026లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో పర్యటించే భారత టీ20 జట్టుతో పాటు ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టీ20ల్లో దుమ్ములేపే ఈ ఆటగాడు వన్డేల్లో ఎలా ఆడతాడోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూడగా.. భారత్-ఏ తరుపున ముక్కోణపు సిరీస్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. కాబట్టి వైభవ్, యశస్వి జైస్వాల్‌లను బ్యాకప్ ఓపెనర్లుగా సిద్ధం చేస్తోంది టీమ్ఇండియా.
