Vaibhav Sooryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 30, 2026 / 10:00 AM IST
Vaibhav Sooryavanshi Creates history to became Fewest balls taken to 1000 IPL runs (pic credit@ipl)
- ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న వైభవ్
- బంతుల పరంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు
Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముల్లన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు ఆండ్రీ రస్సెల్ ను అధిగమించాడు.
ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ 545 బంతుల్లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోగా వైభవ్ సూర్యవంశీ కేవలం 440 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు సాధించాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ – 440 బంతుల్లో
* ఆండ్రీ రస్సెల్ – 545 బంతుల్లో
* టిమ్ డేవిడ్ – 560 బంతుల్లో
* ట్రావిస్ హెడ్ – 575 బంతుల్లో
* ఫిల్ సాల్ట్ – 594 బంతుల్లో
* వీరేంద్ర సెహ్వాగ్ – 604 బంతుల్లో
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఓ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గానూ వైభవ్ సూర్యవంశీ రికార్డులకు ఎక్కాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 12 సిక్సర్లు బాదిన వైభవ్.. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదాడు.
Riyan Parag : నా వల్ల కాలేదు.. బుడ్డోడే కప్పును అందిస్తాడు.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఓ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ – 19 సిక్సర్లు (ఐపీఎల్ 2026లో)
* వృద్ధిమాన్ సాహా – 11 సిక్సర్లు (ఐపీఎల్ 2014లో)
* శుభ్‌మన్ గిల్ – 11 సిక్సర్లు (ఐపీఎల్ 2023లో)
* రజత్ పాటిదార్ – 10 సిక్సర్లు (ఐపీఎల్ 2022లో)
* రజత్ పాటిదార్ – 9 సిక్సర్లు (ఐపీఎల్ 2026లో)
