Vaibhav Sooryavanshi : వైభ‌వ్ ఏంది నీ వైభోగం.. ఆ డిమాండ్ ఏంద‌య్యా.. ఫోటోకు 100 రూపాయ‌ల.. వామ్మో..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు

Vaibhav Sooryavanshi demand 100 rs per photo (pic credit@ipl)

  • ఫోటో దిగుతామ‌ని వ‌చ్చిన ఇద్ద‌రు చిన్నారులు
  • చిన్నారుల‌తో ఫ్రాంక్ చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ
  • ఫోటోకు వంద రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్

Vaibhav Sooryavanshi : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో అంత‌ర్జాతీయ బౌల‌ర్ల‌కు సైతం నిద్ర‌లేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌లో కీల‌క ఆట‌గాడిగా మారాడు. ఎంత‌లా అంటే.. అత‌డు ఆడితేనే జ‌ట్టు గెలిచే పరిస్థితి ఉందంటే అతి శ‌యోక్తి కాదేమో.

త‌న దూకుడైన బ్యాటింగ్‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంటున్నాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. అత‌డితో సెల్ఫీ తీసుకునేందుకు, ఆటో గ్రాఫ్ పొందేందుకు ఎగ‌బ‌డి పోతున్నారు. తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈ యువ ఆట‌గాడి క్రేజ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

RCB : ఆర్‌సీబీ రికార్డు సేఫ్.. ఇక ఎవ‌రి వ‌ల్ల కాదేమో..?

ఇందులో ఇద్ద‌రు చిన్నారులు వైభ‌వ్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోటో కావాల‌ని అడుగుతారు. అయితే.. ఆ ఇద్ద‌రు చిన్నారుల‌ను వైభ‌వ్ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. తన‌తో ఫోటో దిగాలంటే డ‌బ్బులు ఇవ్వాల‌ని, ఒక్కొ ఫోటోకు 100 రూపాయ‌లు అని చెబుతాడు. దీంతో ఆ చిన్నారులు 200 ఇవ్వ‌బోతే.. తాను స‌ర‌దాగా అన్నాన‌ని వ‌ద్ద‌ని చెబుతూ వాళ్ల‌తో ఓ ఫోటో దిగి పంపించివేశాడు. దీనిపై నెటిజ‌న్లు కూడా ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. వైభ‌వ్ ఏంది నీ వైభోగం, ఆ డిమాండ్ ఏంద‌య్యా.. పాపం పిల్ల‌లు అని కామెంట్లు చేస్తున్నారు.

Axar Patel : బెంగ‌ళూరు పై ఘోర ఓట‌మి.. అక్ష‌ర్ ప‌టేల్ హాట్ కామెంట్స్‌.. ఏం జ‌రిగిందో ఇంకా అర్థం కావ‌డం లేదు.. ఆశ్చ‌ర్య‌పోయా..

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడాడు. 44.63 స‌గ‌టు 234.87 స్ట్రైక్‌రేటుతో 357 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 31 ఫోర్లు, 32 సిక్స‌ర్లు బాదాడు.