IND vs ENG : మూడో టీ20కి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. బుడ్డోడికి గాయం..
ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత్‌కు (IND vs ENG) గట్టి షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published on- July 7, 2026 / 02:46 PM IST
Vaibhav Sooryavanshi injury scare ahead of ind vs eng 3rd t20 match
IND vs ENG : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. కాగా.. ఈ సిరీస్‌లో గెలుపొందాలంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది.
టీమ్ఇండియా నయా సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి బలంగా తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MS Dhoni : ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ కలెక్టర్ టూ ట్రోఫీ కలెక్టర్..
నెట్స్‌లో టీమ్ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర ద్వివేది (రఘు) వేసిన బంతిని అంచనా వేయడంలో వైభవ్ విఫలం అయ్యాడు. షార్ట్ బాల్‌ను కొట్టడంలో విఫలం కావడంతో.. ఆ బాల్ నేరుగా అతడి పక్కటెముకలకు బలంగా తాకింది. వెంటనే నొప్పితో వైభవ్ కుప్పకూలిపోయాడు. అతడికి వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది. వైద్యులు అతడికి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
కాగా.. అతడికి అయిన గాయం తీవ్రత పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అతడి గాయం మరీ పెద్దది అయితే అతడు నేడు జరిగే మూడో టీ20లో ఆడడం అనుమానమే. అప్పుడు సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఎట్టకేలకు ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.
