Vaibhav Sooryavanshi : టీమ్ఇండియాలోకి వైభ‌వ్ సూర్యవంశీ..! ఆ సిరీస్‌తోనేనా! స‌చిన్ రికార్డు క‌నుమ‌రుగేనా!

గ‌త కొన్నాళ్లుగా భార‌త క్రికెట్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi )

Vaibhav Sooryavanshi is set to make his senior India debut on the tour of Ireland Report

  • జూన్‌లో ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న భార‌త్
  • ఈ సిరీస్‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక‌య్యే అవ‌కాశం
  • అదే జ‌రిగితే అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డు

Vaibhav Sooryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ.. గ‌త కొన్నాళ్లుగా భార‌త క్రికెట్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. 15 ఏళ్ల ఈ చిచ్చ‌ర పిడుగు బ్యాటింగ్‌కు క్రికెట్ ప్రేమికులు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 2026లోనూ త‌న‌దైన శైలిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇక ఈ ఎడ‌మ‌చేతి వాటం ఆట‌గాడిని టీమ్ఇండియాలోకి ఎంపిక చేయాల‌ని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు.

తాజాగా ఆ రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ అనంత‌రం భారత జ‌ట్టు ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆతిథ్య ఐర్లాండ్‌తో భార‌త్ జూన్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇచ్చి ద్వితియ శ్రేణి జ‌ట్టును పంపాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

IPL 2026 : వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కేకేఆర్‌కు గుడ్‌న్యూస్‌.. డెత్ ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్ వ‌చ్చేస్తున్నాడు

ఇప్ప‌టికే ఇందుకోసం ప‌లువురు ఆట‌గాళ్ల‌తో కూడిన జాబితాను త‌యారు చేశార‌ని, ఇందులో వైభ‌వ్ సూర్య‌వంశీ పేరు ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకవేళ ఐర్లాండ్‌తో జ‌రిగే సిరీస్ వైభ‌వ్ సూర్య‌వంశీ అరంగ్రేటం చేస్తే మాత్రం ఓ అరుదైన రికార్డు అత‌డి సొంతం అవుతుంది.

టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేసిన అతి పిన్న వ‌య‌స్కుడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌న‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ 16 ఏళ్ల వ‌య‌సులో భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు.

SRH vs RR : మా ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలివే.. రియాన్ ప‌రాగ్ కీల‌క వ్యాఖ్య‌లు.. జ‌డేజాకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై

ఒక‌వేళ వైభ‌వ్ సూర్య‌వంశీ ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపికై అక్క‌డ కూడా అద్భుతంగా రాణిస్తే.. జింబాబ్వే సిరీస్‌కు అత‌డు ఎంపిక అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.