Vinod Kambli: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన సచిన్ చిన్ననాటి ఫ్రెండ్
ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న కారును..
- Subhan Ali Shaik
- Published On : February 27, 2022 / 09:35 PM IST
Vinod Kambli
Vinod Kambli: ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. ఈ ఘటన బాంద్రా సొసైటీలో చోటు చేసుకుంది.
వినోద్ కాంబ్లీ (50)పై ఫిర్యాదు చేయగా మోటార్ వెహికల్ యాక్ట్ 185ప్రకారం.. కేసు నమోదు చేశారు. అదే రోజు కాంబ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు. ఘటన తర్వాత కాంప్లెక్స్ వాచ్‌మన్, పొరుగింటి వారితో గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాంబ్లీ 17టెస్టులు ఆడి 1084పరుగులు నమోదు చేయగా అందులో 4సెంచరీలు కూడా ఉన్నాయి. 104వన్డేలు ఆడిన 2వేల 477పరుగులు నమోదు చేశాడు. 1991లో ఇండియా తరపున అరంగ్రేటం చేసిన కాంబ్లీ 2000 అక్టోబరులో చివరి మ్యాచ్ ఆడాడు.
Read Alsor: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాసరి తనయుడు అరెస్ట్
సచిన్ టెండూల్కర్ తో పాటు క్రికెట్ నేర్చుకున్న కాంబ్లీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావాలనుందంటూ తెలిపాడు. గతేడాది డిసెంబరులో సైబర్ మోసం కేసు కూడా నమోదైంది.
