Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్‌లో ఏకైక ఆటగాడు..
IND vs WI : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 27, 2026 / 08:29 PM IST
Virat Kohli Creates history became fatest player to reach 15000 ODI runs
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో వ్యక్తిగత స్కోరు 59 పరుగుల వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక వన్డే క్రికెట్‌లో 15000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గానూ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సచిన్ 377వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి చేరుకోగా కోహ్లీ 303వ వన్డే ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం.
Fastest to 1⃣5⃣0⃣0⃣0⃣ ODI runs ✅
Congratulations to Virat Kohli on becoming the second player to achieve the feat after Sachin Tendulkar 👏👏
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/CMhAIOXQhR
— BCCI (@BCCI) September 27, 2026
ఇక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిటే ఉంది. సచిన్ 463 వన్డేల్లో 44.83 సగటుతో 18426 పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలు, 96 అర్థశతకాలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయానికి వస్తే.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 315 వన్డేల్లో 58.70 సగటుతో 15000 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 463 వన్డేల్లో 18426 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 315 వన్డేల్లో 15000* పరుగులు
* కుమార సంగక్కర (శ్రీలంక) – 404 వన్డేల్లో 14234 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 వన్డేల్లో 13704 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 445 వన్డేల్లో 13430 పరుగులు
