Virat Kohli : ఐపీఎల్‌లో 9 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరేందుకు విరాట్ కోహ్లీకి ఎన్ని ర‌న్స్ కావాలంటే?

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందు కోహ్లీని (Virat Kohli ) ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది.

Virat Kohli need 339 runs to complete 9000 runs in IPL

  • మార్చి 28న‌ ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026
  • ఈ సీజ‌న్‌లో కోహ్లీ 339 ప‌రుగులు చేస్తే
  • ఐపీఎల్‌లో 9 వేల ప‌రుగుల క్ల‌బ్‌లోకి

Virat Kohli : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. కాగా.. ఈ సీజ‌న్ ప్రారంభానికి ముందు కోహ్లీని ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది. ఈ సీజ‌న్‌లో కోహ్లీ 339 ప‌రుగులు సాధిస్తే ఐపీఎల్‌లో 9వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.

ఐపీఎల్ ఆరంభ ఎడిష‌న్ అయిన 2008 నుంచి కోహ్లీ ఆడుతూ ఉన్నాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు మాత్ర‌మే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ 267 ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఆడాడు. 39.5 స‌గ‌టు 132.86 స్ట్రైక్ రేట్‌తో 8661 ప‌రుగులు సాధించాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 63 అర్థ‌సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 113 ప‌రుగులు.

IPL 2026 : ఐపీఎల్ ఆరంభానికి ముందే సీఎస్‌కేకు బిగ్ షాక్.. కీల‌క బౌల‌ర్ దూరం

గత మూడు సీజన్లుగా విరాట్ కోహ్లీ సగటు 53 కు పైనే ఉంది. 2023లో 53.25 సగటుతో 639 పరుగులు, 2024లో 61.75 సగటుతో 741 పరుగులు, 2025లో 54.75 సగటుతో 657 పరుగులు సాధించాడు. ఈ లెక్క‌న చూసుకుంటే 9వేల ప‌రుగుల మైలురాయిని ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే కోహ్లీ అందుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ లీగ్‌లో 8000 పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా కోహ్లీనే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ రోహిత్ శ‌ర్మ 7046 ప‌రుగుల‌తో ఈ లీగ్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన జాబితాలో కోహ్లీ త‌రువాతి స్థానంలో ఉన్నాడు.