రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి గౌతం గంభీర్ విరుచుకుపడ్డాడు. వరుసగా 6 మ్యాచ్ లలో వైఫల్యాలను చవిచూసిన కెప్టెన్ కోహ్లీని గౌతం గంభీర్ మరోసారి తిట్టిపోశాడు. ఒక బ్యాట్స్ మన్ గా కోహ్లీ మాస్టర్ అని చెప్పొచ్చు కానీ, కెప్టెన్ గా మాత్రం కోహ్లీ ఇంకా అప్రెంటిసేనంటూ విమర్శలు గుప్పించాడు. ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో వైఫల్యాలపై కోహ్లీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు.
‘విరాట్ కోహ్లీ బ్యాట్స్ మన్ గా ఓ మాస్టర్. కానీ, కెప్టెన్సీపరంగా అతను ఇంకా అప్రెంటిస్ గానే ఉన్నాడు. ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. బౌలర్లను కించపరచకుండా ముందు తన గురించి తాను తెలుసుకోవాలి. ఆఖరి ఏడాది జరిగిన ఐపీఎల్ వేలం నుంచి మాట్లాడాల్సి వస్తే.. మార్సస్ స్టోనిస్.. నాథన్ కౌల్టర్ నైల్ సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో ఉండరనే సంగతి ముందు తెలియదా?’
చిన్నస్వామి లాంటి ప్లాట్ స్టేడియంలో నేనైతే ఫాస్ట్ బౌలర్ తో బరిలోకి దిగేవాడిని. బౌలర్లను సరిగా వినియోగించుకోలేకపోయారు. రస్సెల్ గురించి ఫేసర్ చెప్పిన మాటలు విని ఉంటే బాగుండేది’ అంటూ విమర్శలు కురిపించాడు. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ఇంకా కెప్టెన్ గా కొనసాగుతున్నాడంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రుణపడి ఉంటాడని విమర్శించిన సంగతి తెలిసిందే. శనివారం ఏప్రిల్ 13న పంజాబ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనుంది.