Virat Kohli : బ్రేకింగ్ న్యూస్‌.. అఫ్గానిస్థాన్‌తో వ‌న్డే సిరీస్‌.. కోహ్లీ ఔట్‌..!

క్రికెట్ అభిమానుల‌కు బిగ్ షాక్ త‌గిలింది. అఫ్గానిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దూరం అయిన‌ట్లు స‌మాచారం.

Virat Kohli ruled out of Afghanistan ODI series Report

  • జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌
  • ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్న విరాట్ కోహ్లీ!

Virat Kohli : క్రికెట్ అభిమానుల‌కు బిగ్ షాక్ త‌గిలింది. అఫ్గానిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ దూరం అయిన‌ట్లు స‌మాచారం. దీంతో ఐపీఎల్ త‌రువాత కోహ్లీ మెరుపులు చూడాల‌ని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్పేలా లేదు.

విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని ఆంగ్ల‌మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అత‌డు అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కోహ్లీ స్థానంలో ఎవ‌రినైనా తీసుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం కోహ్లీ భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. 56.25 స‌గటు, 165.85 స్ట్రైక్‌రేటుతో 675 ప‌రుగులు చేశాడు. కోహ్లీ టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

IND vs AFG : అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు ప్రాక్టీస్ షురూ..

ఇక మ‌రో స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన‌ప్ప‌టికి కూడా ఆడేది అనుమాన‌మే. అత‌డు ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే వ‌న్డే సిరీస్‌లో ఆడ‌తాడ‌ని జ‌ట్టును ఎంపిక చేసిన స‌మ‌యంలో సెల‌క్ట‌ర్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్, అఫ్గానిస్థాన్ వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వ‌న్డే – జూన్ 13న (ధ‌ర్మ‌శాల‌)
* రెండో వ‌న్డే – జూన్ 17న (ఎకానా)
* మూడో వ‌న్డే – జూన్ 20న (చెపాక్‌)

మ్యాచ్‌లు అన్ని మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి.