రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో వరుసగా నాలుగో పరాజయాన్ని మూట గట్టుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్ తో తొలి విజయాన్ని అందించలేకపోయింది. ఈ ఓటమిపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
‘గత మ్యాచ్‌లో బాగానే ఆడాం. కానీ, కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. కొత్తగా వచ్చిన మార్కస్ స్టొయినీస్‌తో కలిసి మోయిన్ అలీ జట్టు స్కోరును 160కి చేర్చాడు. ఇంకా 15 పరుగులు చేసి ఉంటే విజయం కోసం గట్టిగా పోరాడేవాళ్లం’
‘టోర్నీ ముగియడానికి ఇంకా చాలా రోజులు ఉంది. ఆరంభంలో తడబడినంత మాత్రాన ఒత్తిడికి గురి కావలసిన అవసరం లేదు. జట్టు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సమతూకం కోసం జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి ఉంది’
‘మేమంతా కలిసి చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. కొత్త ఆటగాళ్లను జట్టులో తీసుకునే ఆలోచనలో ఉన్నాం ’ అని తెలిపాడు.