Virat Kohli: జూలు విదిల్చిన విరాట్ కోహ్లీ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. టెస్టులో 28వ సెంచరీ నమోదు..
ఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ విజృంభించాడు. ఫలితంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. 28వ సెంచరీ చేయడానికి 1204 రోజులు సమయం పట్టింది.
- Harishth Thanniru
- Published On : March 12, 2023 / 01:41 PM IST
Virat Kohli
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టులో 28వ సెంచరీ నమోదు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో (చివరి) టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 పరుగులు చేసింది. టీమిండియా నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝుళిపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తిచేశాడు. దీంతో దాదాపు 3 ఏళ్ల 3 నెలల 17 రోజుల నిరీక్షణ అనంతరం టెస్టుల్లో కోహ్లీ సెంచరీ చేయడం గమనార్హం. తాజా సెంచరీతో టెస్టులో కోహ్లీకి ఇది 28వ సెంచరీ. వన్డే, ఓవరాల్ క్రికెట్‌లో 75వ సెంచరీ.
Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. స్వదేశంలో ఆ మైలురాయి దాటిన ఐదో ఆటగాడిగా ఘనత
ఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టులో కోహ్లీ విజృంభించాడు. ఫలితంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టుల్లో 28వ సెంచరీ చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. 28వ సెంచరీ చేయడానికి 1204 రోజులు సమయం పట్టింది. పలుసార్లు సెంచరీకి చేరువగా వచ్చిన కోహ్లీ ఔట్ కావటంతో అభిమానులను నిరాశపర్చాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ 28వ సెంచరీని పూర్తి చేశాడు. 241 బాల్స్ ఎదుర్కొన్న కోహ్లీ 100 పరుగులు చేశాడు. ఇందులో ఐదు బౌండరీలు మాత్రమే ఉన్నాయి.
The Man. The Celebration.
Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9
— BCCI (@BCCI) March 12, 2023
స్వదేశంలో కోహ్లీకి ఇది 14వ టెస్ట్ సెంచరీ. భారతదేశం తరపున స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్ లను కోహ్లీ అధిగమించాడు. సుదీర్ఘ కాలం అనంతరం టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాట్ ఎత్తి అభిమానులకు అభివాదం చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
