Virat Kohli – Ishan Kishan: ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఓపెనర్
ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. తనను టీ20 వరల్డ్ కప్ ఓపెనర్ గా దించే అవకాశాలున్నాయని విరాట్ కోహ్లీ చెప్పినట్లు ప్రకటించాడు.
- Subhan Ali Shaik
- Published On : October 9, 2021 / 12:40 PM IST
World Cup Squad
Virat Kohli: ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. తనను టీ20 వరల్డ్ కప్ ఓపెనర్ గా దించే అవకాశాలున్నాయని విరాట్ కోహ్లీ చెప్పినట్లు ప్రకటించాడు. అలా రాబోయే టీ20 వరల్డ్ కప్ లో తన రోల్ ను క్లియర్ చేశాడని అన్నాడు.
‘టీంకు పరుగులు వస్తుండటం చాలా మంచి విషయం. వరల్డ్ కప్ కు ముందే పరుగులు తీస్తూ ఫామ్ లో ఉండటం పాజిటివ్ అంశం. దాదాపు 250 నుంచి 260వరకూ రాబట్టాలని ఆశిస్తున్నాం. అదే మైండ్ లో ఉంచుకుని బెస్ట్ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తా’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
‘విరాట్ భాయ్ తో చక్కటి సంభాషణ జరిగింది. జస్ప్రిత్ బుమ్రా సాయం చేశాడు. నేర్చుకొనే దశలో ఉన్న నాకు ప్రతి ఒక్కరూ సాయం చేశారు. ఇక్కడ చేసిన తప్పులు రాబోయే వరల్డ్ కప్ టోర్నీలో రిపీటే చేయొద్దని సూచనలు ఇచ్చారు. నాకు ఇన్నింగ్స్ ఓపెనర్ గా ఆడటం ఇష్టం. విరాట్ భాయ్ నాకు అదే చెప్పాడు. దానికి తయారుగా ఉండాలని చెప్పాడు. ఇలాంటి పెద్ద టోర్నీలో ఏ పరిస్థితిలో అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
………………………………………………: ఇషాన్ కిషన్ మెరుపు అర్ధ సెంచరీ.. వేగంగా పరుగులు రాబట్టిన 10మంది ఆటగాళ్లు వీళ్లే!
ఇషాన్ కిషన్ ఆడుతున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2021లో ఐదో పొజిషన్ లో ముగించింది. చివరి మ్యాచ్ లో 42పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై గెలుపొందినప్పటికీ.. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవడంలో ఫెయిల్ అయిది.
