IND vs WI 1st ODI Match : ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్న విరాట్.. గిల్, జడేజా కూడా తక్కువేం కాదు.. వీడియోలు వైరల్
భారత్ తరపున వన్డే అరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్ ఖాతాలో తొలి వికెట్ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు.
- Harish Thanniru
- Updated on- July 28, 2023 / 09:48 AM IST
IND vs WI 1st ODI Match
IND vs WI ODI Match : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య తొలి వన్డే గురువారం రాత్రి జరిగింది. ఈ వన్డేలో టీమిండియా ప్లేయర్స్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. దీంతో భారత్ జట్టు విండీస్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు భారత్ ప్లేయర్స్ అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనతో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 22.5 ఓవర్లలోనే 115 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇదిలాఉంటే విండీస్ జట్టుతో తొలి వన్డేలో భారత్ ఫీల్డర్లు అద్భుత ప్రతిభ కనబర్చారు. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశారు. ఆ ఓవర్లో నాలుగో బంతిని షెపర్డ్ ఎదుర్కొన్నాడు. బంతి బ్యాట్ కు తగిలి స్లిప్ వైపుకు దూసుకెళ్లింది. స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ డ్రైవ్‌చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతుకుముందు స్లిప్‌లో గిల్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
భారత్ తరపున వన్డే అరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్ ఖాతాలో తొలి వికెట్ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతిని కొట్టే క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్ లోని రవీంద్ర జడేజాకు ఆలిక్ క్యాచ్ ఇచ్చాడు. జడేజా క్యాచ్‌ను పైకిఎగిరి అందుకున్నాడు. ఇలా గురువారం ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఫీల్డర్లు అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
