Virat Kohli: యువీకి కోహ్లీ విషెస్.. మా ఇద్దరం చాలా కామన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 40వ బర్త్ డే జరుపుకుంటున్న యువరాజ్ కోసం ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో
- Subhan Ali Shaik
- Published on- December 12, 2021 / 07:36 PM IST
Virat Kohli
Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 40వ బర్త్ డే జరుపుకుంటున్న యువరాజ్ కోసం ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని పోస్టు చేశారు. తాను టీమిండియాలోకి వచ్చినప్పుడు యువరాజ్ ఎలా రిసీవ్ చేసుకున్నాడో.. కంఫర్ట్ గా ఫీల్ అయ్యేందుకు ఎంత కారణమయ్యాడో చెప్పుకొచ్చాడు.
‘నేను అండర్-19 వరల్డ్ కప్ నుంచి వచ్చా. అతను నాకు చాలా నైస్ గా వెల్ కమ్ చెప్పాడు. జోక్స్ వేస్తుండేవాడు. మా ఇద్దరికీ ఒకే రకమైన ఫుడ్ ఇష్టం. మేం ఇద్దరం పంజాబీలే కావడం, పంజాబీ సంగీతం వింటుండటం, నైస్ క్లాత్స్పై ఒకే రకమైన ఇష్టం, చాలా ఏళ్ల పాటు అలాగే కొనసాగింది’ అని చెప్పాడు.
అంతేకాదు ఒకానొక సమయంలో కొంతమంది ఇండియన్ క్రికెటర్లు పడిపడీ నవ్వేలా యువీ చేశాడని ఓ సంఘటనను గుర్తు చేశాడు.
……………………………………..: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!
‘షాపింగ్ కోసం కొంతమంది బయటకు వెళ్తున్నాం. దాంబుల్లాలో ఉన్నాం. మ్యాచ్ ఇంకా రెండ్రోజుల్లో స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము 3.. మూడున్నర టైంలో సైకిల్ మీద కొలంబోకు బయల్దేరాం. ఆ దారుణమైన విషయానికి మేమంతా పడిపడి నవ్వాం’
‘హ్యాపీ బర్త్ డే యువీ పా. చాలా ప్రశాంతత, సంతోషం, ఉన్నత విలువలతో పాటు ఎల్లప్పుడూ ప్రేమ కురవాలని కోరుకుంటున్నా’ అని ముగించాడు.
రీసెంట్ గా కోహ్లీని రీప్లేస్ చేస్తూ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను అపాయింట్ చేసింది బీసీసీఐ. రెడ్ బాల్ జట్టుకు మాత్రమే కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
