Virat Kohli : మీడియాపై విరాట్ కోహ్లీ బ్రదర్ ఆగ్రహం.. మా అమ్మకు ఏం కాలేదు
కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. ఫేక్‌న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : January 31, 2024 / 03:47 PM IST
Virat Kohli’s brother slams fake news about mother’s bad health
Virat Kohli’s brother : వ్యక్తిగత కారణాలతో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టు మ్యాచులకు దూరం అయ్యాడు. మూడో టెస్టు నుంచైనా అతడు అందుబాటులోకి వస్తాడా లేడా అన్నదానిపై ఓ వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు అతడు మొదటి రెండు టెస్టులకు దూరం అవ్వడం పై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
కోహ్లీ భార్య అనుష్క గర్భవతి కావడంతో ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు అతడు సెలవు తీసుకున్నాడని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అతడి తల్లి సరోజ్ అనారోగ్యంగా ఉండడం వల్లే మ్యాచులు ఆడడం లేదని ప్రచారం చేస్తున్నారు.
Mayank Agarwal : టీమ్ఇండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు ఏమైంది? హానికర ద్రవం ఎందుకు తాగాడంటే?
కాగా.. వీటిపై కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. ఫేక్‌న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మకి ఏం కాలేదని, పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగానే ఉంది చెప్పాడు. ఫేక్‌న్యూస్ ప్రచారం అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నాడు. వివరాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. తమపై ప్రేమ చూపిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు.
కాగా.. అసలు విరాట్ కోహ్లీ ఎందుకు ఏ కారణం చేత మొదటి రెండు టెస్టులకు దూరం అయ్యాడు అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. బీసీసీఐ సైతం కోహ్లీ వ్యక్తిగత కారణాలతోనే తప్పుకున్నాడని, అతడి ప్రైవసీని గౌరవించాలని సూచించిన సంగతి తెలిసిందే.
Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలెట్టింది.
