Virat Kohli Video: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ భారత ఆటగాళ్ల సమక్షంలో కేక్ కోసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా మెంటర్ ప్యాడీ అప్టన్ కూడా ఇవాళ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. కోహ్లీతో పాటు ప్యాడీ అప్టన్ కేక్ కట్ చేశాడు.
‘ఆస్ట్రేలియాలో పుట్టినరోజు వేడుక… జన్మదిన శుభాకాంక్షలు విరాట్ కోహ్లీ, ప్యాడీ అప్టన్’ అని బీసీసీఐ పేర్కొంది. కేక్ కట్ చేసిన అనంతరం కోహ్లీ ముఖానికి దాన్ని తోటి ఆటగాళ్లు పూశారు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా ఆ దేశంలోనే ఉన్న విషయం తెలిసిందే.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్-జింబాబ్వే మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ ద్వారా కోహ్లీ మళ్ళీ ఫాంలోకి వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత మెంటర్ గా ప్యాడీ అప్టన్ ఉన్నాడు. ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లడం దాదాపు ఖరారైంది. గ్రూప్-బీలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది.
Birthday celebrations ON in Australia ? ?
Happy birthday @imVkohli & @PaddyUpton1 ? ? #TeamIndia | #T20WorldCup pic.twitter.com/sPB2vHVHw4
— BCCI (@BCCI) November 5, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..