×
Ad

Jacob Bethell: భారత్‌ను బెంబేలెత్తించిన 22ఏళ్ల కుర్రాడు.. ఎవరీ జాకబ్ బెథెల్

13 సంవత్సరాల వయసులో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అతని తాత ఆర్థర్ బెథెల్ బార్బడోస్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

  • Published On : March 5, 2026 / 11:35 PM IST

Pic Courtesy @ EspnCricInfo

 

 

Jacob Bethell: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేశాడు. ఈ మ్యాచ్ లో అతడు సంచలన బ్యాటింగ్ చేశాడు. భారీ టార్గెట్ ఉన్నా భయపడలేదు. దూకుడు ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ ను గెలిపించినంత పని చేశాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ తో ఒక్కసారిగా జాకబ్ బెథెల్ హీరో అయిపోయాడు. ఎవరీ జాకబ్ బెథెల్ అని తెలుసుకునేందుకు క్రికెట్ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

జాకబ్ గ్రాహం బెథెల్ ఇంగ్లండ్ క్రికెటర్. సెప్టెంబర్ 2024లో సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2003 అక్టోబర్ 23న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో పుట్టి పెరిగిన బెథెల్.. వార్విక్‌షైర్‌లోని ప్రతిష్టాత్మక రగ్బీ స్కూల్‌లో స్కాలర్‌షిప్ పొందాడు. 13 సంవత్సరాల వయసులో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అతని తాత ఆర్థర్ బెథెల్ బార్బడోస్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా బెథెల్‌ ను మెచ్చుకున్నాడు. నువ్వు నాకన్నా బెటర్ గా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ బెల్ సైతం బెథెల్ ను కీర్తించాడు. తాను చూసిన 17 ఏళ్ల వయసు క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్ అని ప్రశంసించాడు.

2024లో న్యూజిలాండ్ పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేయడానికి ముందు.. బెథెల్ ఇంగ్లండ్ తరపున 20 టీ20 మ్యాచ్‌లు, 18 వన్డే మ్యాచ్‌లు, 4 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో సగటున 38.7 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 96. ఆగస్టులో ఓవల్‌లో భారత్‌ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో అతడు 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 6, 5 పరుగులు మాత్రమే చేశాడు.

డిసెంబర్ ప్రారంభంలో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్‌లో బెథెల్ తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టు సభ్యులు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్, టాడ్ మర్ఫీలను ఎదుర్కొని ఇంగ్లండ్ లయన్స్ తరపున 71 పరుగులు చేశాడు. బెథెల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్దోడాక్స్ బౌలర్ కూడా. టెస్ట్ బెస్ట్ ఫిగర్స్ 3-72.