Mukul Choudhary IPL 2026: కేకేఆర్ పై సిక్సర్ల సునామీ.. ఎవరీ ముకుల్ చౌదరి.. వేలంలో కోట్ల వర్షం కురిపించిన లక్నో..
కేకేఆర్ పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లక్నోకు నమ్మశక్యం కానీ విజయాన్ని అందించాడు ముకుల్ చౌదరి (Mukul Choudhary).
- Thota Vamshi Kumar
- Updated on- April 10, 2026 / 06:07 PM IST
Who Is Mukul Choudhary Who Clinched Win With 7 Sixes Against KKR in IPL 2026 (pic credit@ipl)
- రాజస్థాన్‌కు చెందిన ముకుల్ చౌదరి
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏమంత గొప్ప రికార్డు లేకపోయినా
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు
- వేలంలో కోట్ల వర్షం కురిపించిన లక్నో
- కేకేఆర్ పై మ్యాచ్ విన్నింగ్స్
Mukul Choudhary : అనామక కుర్రాళ్లు ఎందరో ఐపీఎల్‌లో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన సందర్భాలు ఎన్నో. తాజాగా ముకుల్ చౌదరి కూడా ఈ జాబితాలోనే చేరాడు. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు ముకుల్ చౌదరి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆశలే లేని దశ నుంచి లక్నో జట్టుకు నమ్మశక్యం గాని విజయాన్ని అందించాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం ముకుల్ చౌదరి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుంచి మాజీ క్రికెటర్లు సైతం కొనియాడుతున్నారు.
ఎవరీ ముకుల్ చౌదరి ?
2004 ఆగస్టు 6న ముకుల్ చౌదరి జన్మించాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్ఝును జిల్లా గుఢాగాడ్జీ గ్రామానికి చెందిన వాడు. జనవరి 2023లో అతడు రాజస్థాన్ తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 103 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 45. ఇక టీ20 క్రికెట్ విషయానికి వస్తే.. అక్టోబర్ 2023లో అరంగ్రేటం చేశాడు. జార్ఖండ్ పై ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 37.66 సగటుతో 226 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 62 పరుగులు
మొదట్లో మీడియం పేసర్‌గా ఉన్నప్పటికీ, ఆపై వికెట్ కీపింగ్‌కు మారి, ఆ తర్వాత తన దూకుడు బ్యాటింగ్‌తో పేరు తెచ్చుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 198.85 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులతో చేశాడు.
*ఇప్పుడు షమీ కుర్రాడేమీ కాదు.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ క్రమంలో ఐపీఎల్ 2026 వేలంలో అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. 30లక్షల బేస్ ప్రైస్‌తో అతడు పెట్టిన అతడిని లక్నో జట్టు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది.
