Uma Kashvi : ఎవరీ ఉమా కాష్వి? డబ్ల్యూపీఎల్ వేలంలో చరిత్ర.. లేడీ వైభవ్ సూర్యవంశీ!
Uma Kashvi : కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఉమా కాష్వి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో చరిత్ర సృష్టించింది.
- Thota Vamshi Kumar
- Updated on- October 29, 2026 / 11:45 AM IST
Who Is Uma Kashvi The Youngest Player In WPL Auction History
Uma Kashvi : కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఉమా కాష్వి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో చరిత్ర సృష్టించింది. వేలం చరిత్రలో అమ్ముడైన అతి పిన్న వయస్కురాలైన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. బుధవారం కొచ్చి వేదికగా జరిగిన WPL 2027 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఈ ఆల్‌రౌండర్‌ను రూ. 10 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది.
కాగా.. గతంలో ఈ రికార్డు దీయా యాదవ్ పేరిట ఉండేది. ఆమె 16 ఏళ్ల వయసులో డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైంది. ఇటీవల భారత పురుషుల జట్టులోకి 15 ఏళ్లకే అడుగుపెట్టి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తరహాలోనే, ఇప్పుడు కాష్వి కూడా భారత మహిళా క్రికెట్‌లో తన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. కాష్వి కుడిచేతి వాటం బ్యాటర్ కాగా.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంది.
Tilak Varma : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్.. తిలక్ వర్మను ఊరిస్తున్న భారీ మైలురాయి..
ఇటీవల జరిగిన బీసీసీఐ మహిళల అండర్-15 వన్డే టోర్నమెంట్‌లో కాష్వి అదరగొట్టింది. 172 సగటుతో 516 పరుగులు చేసింది. ఇందులో మూడు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. 2026 జూన్-జూలైలలో శ్రీలంకతో జరిగిన భారత్ U-19 సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4 వికెట్లు, రెండు వన్డేల్లో వికెట్లు సాధించింది.
