Mumbai Indians : రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాన్ని చెప్పిన ముంబై కోచ్‌.. స్పందించిన హిట్‌మ్యాన్ భార్య‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియ‌న్స్ తీసుకున్న నిర్ణ‌యం పెను ప్ర‌కంప‌న‌లు రేపింది.

Mumbai Indians : రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాన్ని చెప్పిన ముంబై కోచ్‌..  స్పందించిన హిట్‌మ్యాన్ భార్య‌

Why Hardik Pandya Replaced Rohit Sharma As Captain Mumbai Indians Coach Reveals Real Reason

Mumbai Indians – Rohit Sharma : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియ‌న్స్ తీసుకున్న నిర్ణ‌యం పెను ప్ర‌కంప‌న‌లు రేపింది. ఆ జ‌ట్టుకు ఐదు సార్లు టైటిల్ ను అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. అత‌డి స్థానంలో హార్దిక్ పాండ్య‌ను నాయ‌కుడిగా నియ‌మించింది. ఈ విష‌యంపై అప్ప‌ట్లో ముంబై జ‌ట్టు యాజ‌మాన్యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై తాజాగా ఆ జ‌ట్టు కోచ్ మార్క్ బౌచ‌ర్ స్పందించాడు. ముంబై భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు.

కేవ‌లం ఇది ఆట ప‌రంగా తీసుకున్న విధానప‌ర నిర్ణ‌య‌మేన‌ని చెప్పుకొచ్చాడు. త‌న వ‌ర‌కు ఇది ఓ ప‌రివ‌ర్త‌న ద‌శ మాత్ర‌మేన‌న్నాడు. ఈ విష‌యం చాలా మందికి అర్థం కావ‌డం లేద‌ని, భావోద్వేగానికి గుర‌వుతున్నార‌ని అన్నాడు. ఉద్వేగాల‌ను ఆట‌కు సంబంధించిన విష‌యాల్లో ప‌క్క‌న పెట్టాల్సి ఉంద‌ని తెలిపాడు. రోహిత్ ఓ అద్భుత‌మైన ఆట‌గాడ‌ని కితాబు ఇచ్చాడు. కెప్టెన్సీ బరువు అత‌డి నుంచి దిగిపోవ‌డంతో అత‌డి అత్యుత్త‌మ ఆట‌ను చూసే వీలు ఉంటుంద‌ని చెప్పాడు.

India tour Of Zimbabwe : అలా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అయిపోగానే.. ఇలా జింబాబ్వేకు వెళ్ల‌నున్న భార‌త క్రికెట‌ర్లు

కెప్టెన్సీ మార్పున‌కు ఐపీఎల్‌లో క్రికెటేత‌ర బాధ్య‌త‌లు కూడా మ‌రో కార‌ణం అని తెలిపాడు. గ‌త రెండు సీజ‌న్‌లో బ్యాట్‌తో రోహిత్ అంత‌గా రాణించ‌లేక‌పోయాడ‌న్నారు. అత‌డి భుజాల‌పై ఉన్న బాధ్య‌త‌ల‌ను త‌గ్గించాల‌ని భావించిన‌ట్లు చెప్పాడు. లీగ్‌లో కెప్టెన్‌కు ఆట మాత్ర‌మే కాకుండా ఇంకా చాలా బాధ్య‌త‌లు ఉంటాయ‌న్నాడు. ఫోటోషూట్స్‌, యాడ్స్ వంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంద‌న్నాడు. బౌచ‌ర్ మాట్లాడిన మాట‌లు వైర‌ల్‌గా మార‌గా దీనిపై రోహిత్ శ‌ర్మ భార్య రితికా స‌జ్జే స్పందించింది. దీని వ‌ల్ల చాలా త‌ప్పిదాలు జ‌రిగాయి అంటూ విమ‌ర్శ‌నాత్మ‌క పోస్ట్ చేసింది. దీంతో నెటింట్ట పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది.