India tour Of Zimbabwe : అలా టీ20 ప్రపంచకప్ అయిపోగానే.. ఇలా జింబాబ్వేకు వెళ్లనున్న భారత క్రికెటర్లు
వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమ్ఇండియా, జింబాబ్వే జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.

India tour Of Zimbabwe
Team India : జూలైలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమ్ఇండియా, జింబాబ్వే జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. జూలై 6 తేదీ నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. మొత్తం ఐదు టీ20 మ్యాచుల్లో భారత్, జింబాబ్వేలు తలపడనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు వెల్లడించింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. తమ దేశంలో ఈ ఏడాది జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదేనని, భారత జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ తెలిపారు.
IND vs ENG : అబుదాబిలో ఇంగ్లాండ్ జట్టు ఏం చేస్తుందో తెలుసా?
ఈ పర్యటనపై బీసీసీఐ సెక్రటరీ జే షా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కమ్యూనిటీకి సహకారం అందించడంలో బీసీసీఐ ఎల్లప్పుడూ మార్గదర్శక పాత్ర పోషిస్తుందన్నారు. ఇది జింబాబ్వేకి పునర్నిర్మాణ కాలం అని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు.
India Tour of Zimbabwe
?️ July 2024
5⃣ T20Is ?
? HarareMore details ? https://t.co/lmtzVUZNCq#TeamIndia | #ZIMvIND pic.twitter.com/CgVkLS8JIB
— BCCI (@BCCI) February 6, 2024
షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జూలై 6
రెండవ టీ20 – జూలై 7
మూడో టీ20 – జూలై 10
నాలుగో టీ20 – జూలై 13
ఐదో టీ20 – జూలై 14
AUS vs WI : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 6.5 ఓవర్లలో ముగిసిన వన్డే!