IPL 2026 : RR vs MI మ్యాచ్‌కు వర్షం ముప్పు..! మ్యాచ్ రద్దైతే ముంబై, రాజస్థాన్‌లలో ఎవరికి లాభం?
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
Will rain play spoils today RR vs MI match in IPL 2026
- గౌహతి వేదికగా నేడు రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్
- పొంచి ఉన్న వర్షం ముప్పు
- రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఓ వైపు మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అంచనాలకు భిన్నంగా కొన్ని జట్ల ప్రదర్శన ఉంది. మరోవైపు అకాల వర్షాల భయపెడుతున్నాయి. భారీ వర్షం కారణంగా సోమవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.
ఇక నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అక్యూవెదర్ ప్రకారం మంగళవారం గౌహతిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం 49 నుంచి 55 శాతం ఉన్నట్లుగా అంచనా వేసింది.
అబ్బాయి నుంచి అమ్మాయిగా.. క్యూట్ ఫోటోలను షేర్ చేసిన అనయ బంగర్..
అయితే.. మ్యాచ్ జరిగే సమయం అంటే రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని, వర్షం కురిసే అవకాశం కేవలం 10 శాతం ఉన్నట్లుగా తెలిపింది. అయితే.. మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిస్తే మాత్రం ఔట్ ఫీల్డ్ చిత్తగా మారే అవకాశం ఉంది.
సోమవారంలా వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశాలు లేకున్నా ఓవర్లు కుదించి అయినా మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇది అక్కడి డ్రైనేజీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్‌కు ముందు భారీ వర్షం పడితే ఎంత సేపటిలో మైదానాన్ని సిద్ధం చేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
రాజస్థాన్‌తో ముంబై మ్యాచ్ నేడు.. హార్దిక్ పాండ్యా ఆడేనా? ముంబై కోచ్ ఏమన్నాడంటే?
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు ఆర్ఆర్ ఖాతాలో 5 పాయింట్లు చేరుతాయి. ప్రస్తుతం పాయిట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్ఆర్ జట్టు అగ్రస్థానానికి దూసుకువెలుతుంది. అదే సమయంలో ముంబై పాయింట్ల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ముంబై ఐదో స్థానానికి చేరుకుంటుంది.
