Women Asia Cup 2026 : మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Women Asia Cup 2026 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

Women Asia Cup 2026 Schedule released

Women Asia Cup 2026 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి దుబాయ్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి.

గ్రూప్‌-ఏలో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్‌తో పాటు థాయ్‌లాండ్‌. హాంకాంగ్‌ చైనాలు ఉన్నాయి. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, యూఏఈ, ఇండోనేసియాలు ఉన్నాయి. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 5న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్..

* ఆగస్టు 30న‌ థాయ్‌లాండ్‌తో
* సెప్టెంబర్ 3న‌ హాంకాంగ్ చైనాతో
* సెప్టెంబర్ 5న‌ పాకిస్థాన్‌తో

IND vs SL : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక‌కు భారీ షాక్..

గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ సెప్టెంబర్ 10న జ‌ర‌గ‌నుండ‌గా, రెండో సెమీఫైనల్ సెప్టెంబర్ 11న జ‌ర‌గ‌నుంది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది.

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ ఇప్ప‌టి వ‌ర‌కు 9 సార్లు జ‌ర‌గ‌గా.. భార‌త్ అత్య‌ధికంగా ఏడు సార్లు విజేత‌గా నిలిచింది. బంగ్లాదేశ్, శ్రీలంక‌లు ఒక్కొసారి గెలుపొందాయి.