Ind vs Pak : మహిళల ప్రపంచ కప్‌.. పాకిస్థాన్ పై ఇండియా ఘన విజయం..

మహిళల టీ20 ప్రపంచ కప్‌ లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడింది. (Ind vs Pak)

  • Updated on- June 14, 2026 / 10:59 PM IST

Ind vs Pak

Ind vs Pak : మహిళల టీ20 ప్రపంచ కప్‌ లో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో తలపడింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్మృతి మంధాన 44 బంతుల్లో 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది.

భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీసి పాక్ ని కుప్పకూల్చింది. టీమ్ఇండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల టీం ఘనంగా ప్రపంచకప్ ని పాకిస్థాన్ పై విజయంతో మొదలుపెట్టింది.