Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచ‌రీ.. డిస్నీ+హాట్‌స్టార్ పంట పండింది..!

కోహ్లీ దెబ్బ‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు చిత్త‌వ్వ‌గా బ్రాడ్ కాస్ట‌ర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది.

Virat Kohli century creates new record

Virat Kohli century : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేసి త‌న పుట్టిన రోజును చిర‌స్మ‌ర‌ణీయం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన స‌చిన్ రికార్డును స‌మం చేశాడు. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 49వ సెంచ‌రీ కావ‌డం విశేషం. కోహ్లీ దెబ్బ‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు చిత్త‌వ్వ‌గా బ్రాడ్ కాస్ట‌ర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది. లైవ్ స్ట్రీమ్‌లో వ్యూయ‌ర్స్‌ అమాంతం పెరిగి ఆల్‌టైమ్ రికార్డును తాకింది.

విరాట్ కోహ్లీ సెంచ‌రీ పూర్తి చేసే స‌మ‌యంలో 4.4 కోట్ల మంది లైవ్‌స్ట్రీమింగ్‌లో వీక్షించారు. ఓ ఈవెంట్‌ను ఒకేసారి అత్య‌ధిక సంఖ్య‌లో ప్రేక్ష‌కులు లైవ్‌స్ట్రీమింగ్‌లో చూడ‌డం ఇదే మొద‌టి సారి. ఈ మెగాటోర్నీలోనే న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు హాట్‌స్టార్‌లో 4.3 కోట్ల మంది ఒకేసారి వీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే రికార్డు ఉండ‌గా తాజాగా ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

Glenn Maxwell : మాక్స్‌వెల్ కు బై-ర‌న్న‌ర్‌ను ఎందుకు అనుమతించ‌లేదు..? అలాగే ఎందుకు బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది..?

అంత‌క ముందు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ ఉండేది. ప్రాన్స్, అర్జెంటీనా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను ఏక‌కాలంలో 3.2 కోట్ల మంది వీక్ష‌కులు జియో సినిమాస్ ఫ్లాట్‌ఫామ్‌లో చూశారు. అప్ప‌ట్లో ఇది ఓ రికార్డు.

ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ సెంచ‌రీ చేసి స‌చిన్ రికార్డును స‌మం చేసిన త‌రువాత మైదానంలో ప్రేక్ష‌కుల అరుపుల‌తో ద‌ద్ద‌రిల్లింది. 118 డెసిబెల్స్ సౌండ్ వ‌చ్చింది. కాగా.. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంత శ‌బ్ధంతో ఫ్యాన్స్ కేక‌లు పెట్టడం ఇదే తొలిసారి.

ఫ్రీ గా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచులు..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల‌ను ఉచితంగా చూసే అవ‌కాశాన్ని డిస్నీ+హాట్ స్టార్ క‌ల్పించింది. అంత‌క ముందు ఆసియా క‌ప్ మ్యాచుల‌ను కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. అయితే.. ఈ అవకాశం కేవ‌లం మొబైల్‌లో మాత్ర‌మే ఇచ్చింది. ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌, టీవీల్లో చూడాలంటే మాత్రం స‌బ్‌స్క్రిష‌న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా.. ఐపీఎల్ 2023 సీజ‌న్‌ను జియో సినిమాస్‌లో ఉచితంగా ప్ర‌సారం చేసిన సంగ‌తి తెలిసిందే.

ODI World Cup 2023 : అఫ్గానిస్థాన్ కొంప‌ ముంచిన క్యాచ్‌.. లేదంటేనా..!

 

ట్రెండింగ్ వార్తలు