Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

pic @ BCCI twitter

Virat Kohli breaks Anil Kumble record : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డ‌ర్‌(నాన్ వికెట్ కీప‌ర్‌)గా రికార్డుల్లోకి ఎక్కాడు. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డేలో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవ‌డం ద్వారా విరాట్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్యాచ్‌తో క‌లిపి విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో 15 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే రికార్డును అధిగ‌మించాడు. కుంబ్లే 14 క్యాచ్‌లు అందుకున్నాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాళ్లు వీరే (నాన్ వికెట్ కీప‌ర్‌)

విరాట్ కోహ్లీ -15
అనిల్ కుంబ్లే – 14
క‌పిల్ దేవ్ – 12
స‌చిన్ టెండూల్క‌ర్ -12

ODI World Cup 2023: నిన్ను వదలం..! నవీన్-ఉల్-హక్ ను మరోసారి ర్యాగింగ్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. వీడియో వైరల్

కాగా.. విరాట్ కోహ్లీకి ఇది నాలుగో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. బుమ్రా ధాటికి మూడో ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 16/1. డేవిడ్ వార్న‌ర్ (5), స్టీవ్ స్మిత్ (11) లు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు