WPL 2026 : డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఎల్లీస్ పెర్రీ రికార్డు పై స్మృతి మంధాన కన్ను.. ఏకైక ఆర్సీబీ ప్లేయర్‌గా
ఢిల్లీ క్యాపిటల్స్‌తో డబ్ల్యూపీఎల్ 2026 (WPL 2026) ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
WPL 2026 Final RCB vs DC Smriti Mandhana eye on Ellyse Perry RCB record
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో మంధాన 37 పరుగులు చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించనుంది.
ప్రస్తుతం ఈ రికార్డు ఎల్లీస్ పెర్రీ పేరిట ఉంది. ఆర్సీబీ తరుపున పెర్రీ 25 మ్యాచ్‌ల్లో 64.8 సగటు, 132.96 స్ట్రైక్‌రేటుతో 972 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది అర్థశతకాలు ఉన్నాయి. ఇక మంధాన విషయానికి వస్తే.. మంధాన ఇప్పటి వరకు ఆర్సీబీ తరుపున 34 మ్యాచ్‌లు ఆడింది. 29.25 సగటుతో 132.39 స్ట్రైక్‌రేటుతో 936 పరుగులు సాధించింది.
ఒకవేళ మంధాన ఫైనల్ మ్యాచ్‌లో 64 పరుగులు చేస్తే ఆర్సీబీ తరుపున డబ్ల్యూపీఎల్‌లో 1000 పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కుతుంది. ఇక ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా నిలవనుంది. నాట్ స్కైవర్-బ్రంట్, మెగ్ లానింగ్, హర్మన్ ప్రీత్ కౌర్, షపాలీ వర్మలు మాత్రమే డబ్ల్యూపీఎల్‌లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేశారు.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* నాట్ స్కైవర్-బ్రంట్ – 1348 పరుగులు
* మెగ్ లానింగ్ – 1200 పరుగులు
* హర్మన్‌ప్రీత్ కౌర్ – 1193 పరుగులు
* షఫాలీ వర్మ – 1104 పరుగులు
* ఎల్లీస్ పెర్రీ – 972 పరుగులు
* స్మృతి మంధాన – 936 పరుగులు
Ishan Kishan : అలా ఎలా కొట్టావ్ ఇషాన్.. ఈ షాట్‌ను ఏమని పిలవాలో? వీడియో
ఈ సీజన్ ఆడని ఎల్లీస్ పెర్రీ..
డబ్ల్యూపీఎల్ 2026 వేలం కన్నా ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీని ఆర్సీబీ రెండు కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే.. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఆర్సీబీ సాయలి సత్గారేను తీసుకుంది.
